టాలీవుడ్లో మరో కొత్త హీరో పరిచయానికి రంగం సిద్ధమైంది. అనీష్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇట్లు అర్జున సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం విడుదల చేశారు. తొలి సినిమాతోనే విభిన్నమైన పాత్రను ఎంచుకున్న అనీష్‌ను ఎన్టీఆర్ అభినందిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్లో అర్జున్ అనే యువకుడు మాటలు మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తాడు. అతడు ఎంతో తెలివైనవాడు. కీర్తి అనే యువతితో ప్రేమలో ఉన్న అర్జున్ జీవితంలోకి అనుకోకుండా ఓ ప్రమాదకరమైన పరిస్థితి ప్రవేశిస్తుంది. ఒక రహస్యమైన పెన్‌డ్రైవ్, రూ.1,000 కోట్ల డీల్ చుట్టూ కథ ఆసక్తికరంగా మారుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒకవైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్స్టర్లు అర్జున్, కీర్తిలను వెంటాడుతుండటంతో కథలో ఉత్కంఠ పెరుగుతుంది. ప్రేమ, యాక్షన్, కామెడీ, సస్పెన్స్ అంశాలతో ట్రైలర్‌ను రూపొందించారు.












