పొరుగు
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేళాను ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ మూడు రోజుల రైతు మేళాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (), పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి (), క్రిడా (), కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ ఇన్పుట్స్, నూతన తరం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారు. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అవార్డు గ్రహీతలైన ప్రగతిశీల రైతులతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (), ఇతర భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అవకాశాలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను వివరించనున్నారు.












