భారత మహిళా క్రికెటర్ ప్రేమా రావత్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
పుణెలోని ఎంసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ తరఫున ప్రేమా రావత్ ఈ ఘనత సాధించింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన పోరులో ఆమె కేవలం 14 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదింది. 357.14 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రికార్డుల వివరాలు
ఇప్పటివరకు మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు 15 బంతులుగా ఉండేది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా, ఇంగ్లండ్‌కు చెందిన మేరీ కెల్లీ, న్యూజిలాండ్‌కు చెందిన లారా హారిస్ ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు ప్రేమా రావత్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆ రికార్డును అధిగమించింది.












