రైలులో టీటీఈగా నటిస్తూ ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు చూపాలని కోరడంతో అనుమానం వచ్చిన ఓ ప్రయాణికుడు ఆమెను గుర్తింపు కార్డు చూపించాలని ప్రశ్నించాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
మహారాష్ట్ర నుంచి బిహార్‌కు వెళ్తున్న రైలులో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మహిళ టీటీఈగా పరిచయం చేసుకుంటూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు చూపించాలని కోరింది. టికెట్ లేని ఓ ప్రయాణికుడికి టికెట్ ఇస్తానంటూ అతడి పేరు అడిగి తన బ్యాగులో నుంచి తెల్ల కాగితం తీసి దానిపై రాయడం ప్రారంభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఐడీ కార్డు అడగడంతో అనుమానం
ఆమె యూనిఫామ్ ధరించకపోవడం, అధికారిక గుర్తింపు కార్డు చూపించకపోవడంతో ఒక ప్రయాణికుడికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమె ఐడీ కార్డు చూపించాలని కోరాడు. అయితే తన గుర్తింపు కార్డును ప్రయాణికులకు చూపించాల్సిన అవసరం లేదని ఆమె సమాధానమిచ్చినట్లు తెలిసింది.












