నటి రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల తన వెబ్‌సిరీస్ అక్క ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గతంలో ఓ తెలుగు సినిమాలో నటించినప్పుడు ఎదురైన అనుభవాలను వివరించారు. తనకంటే వయసులో పెద్దవారైన హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని, కథలోని కొన్ని భాగాలు తనకు అసౌకర్యంగా అనిపించాయని ఆమె తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో పురుషాధిక్య ధోరణి ఉందని, ఉత్తరాది నటీమణులకు తెల్లటి చర్మం ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని ఆమె విమర్శించారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) పరోక్షంగా స్పందించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, అయితే నిర్మాణాత్మక విమర్శలకు, ఒక పరిశ్రమను కించపరచడానికి మధ్య తేడా ఉందని ఆయన అన్నారు. తెలుగు, దక్షిణాది సినిమాలకు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, కథా సంప్రదాయాలు ఉన్నాయని, వాటిని గౌరవించాలని సూచించారు. తనను ఆదరించిన చిత్ర పరిశ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్కేఎన్ స్పందన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నటి రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తనకంటే వయసులో పెద్ద హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని, కథలోని కొన్ని భాగాలు తనకు అసౌకర్యంగా అనిపించాయని ఆమె తెలిపారు. నిర్మాత ఎస్కేఎన్, రాధికా ఆప్టే వ్యాఖ్యలపై స్పందిస్తూ, దక్షిణాది పరిశ్రమను కించపరచడం సరికాదని, ఇక్కడి సంస్కృతిని గౌరవించాలని సూచించారు.












