కడప నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం కోసం ఫోన్లు చేసినా కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో కడప నగరపాలక సంస్థ అధికారులు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. సమాచారం కోసం ఫోన్లు చేసినా కమిషనర్, అడిషనల్ కమిషనర్ స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, కార్పొరేషన్ అధికారులు కనీసం ఫోన్లు ఎత్తడం లేదని మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆర్డీఓ, కమిషనర్ వంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రతి ఎన్నికల సమయంలో మీడియా కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేవారు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంతవరకు మీడియా సెల్ ఏర్పాటు చేయలేదు.











