ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎక్సైజ్ పాలసీ కేసులో ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు. రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి ఆరోపణలపై నమోదైన కేసులో అరవింద్ కేజ్రీవాల్‌తో సహా 23 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు కేజ్రీవాల్‌కు ఊరటనిచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.









