తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. మార్చిలో జరగనున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ సింపోజియంలో వక్తగా పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలవడం విశేషం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విధానాల రూపకల్పన, దాని భవిష్యత్ ప్రభావంపై ఈ సింపోజియం లోతుగా చర్చిస్తుంది.
ఈ ఆహ్వానం ముఖ్యమంత్రికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.










