దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక సమయాన్ని అమలు చేయడంలో ఢిల్లీలోని జాతీయ భౌతిక ప్రయోగశాల కీలక పాత్ర పోషిస్తోంది. భారత ప్రామాణిక కాలమానం నిర్ధారణకు అత్యంత ఖచ్చితమైన అణు గడియారాలను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా అధికారిక వ్యవహారాలు, శాస్త్రీయ పరిశోధనలు, ఆర్థిక లావాదేవీలకు సమయ ప్రమాణాన్ని నిర్వహిస్తున్నారు.
భారత ప్రామాణిక సమయం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుంటుంది. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ ప్రాంతం మీదుగా వెళ్తుంది. అయితే, దేశ ప్రామాణిక సమయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించే బాధ్యత ఢిల్లీలోని జాతీయ భౌతిక ప్రయోగశాలపైనే ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అణు గడియారాలతో సమయ నిర్ధారణ
సాధారణ గడియారాలతో పోలిస్తే అణు గడియారాలు అత్యంత సూక్ష్మమైన సమయాన్ని కొలవగలవు. సీజియం-133 అణువులో జరిగే నిర్దిష్ట ప్రకంపనలను ఆధారంగా చేసుకుని ఒక సెకనును నిర్వచిస్తారు. ఈ అత్యంత ఖచ్చితమైన గడియారాల సమయాన్ని సమన్వయం చేయడం ద్వారా భారత ప్రామాణిక సమయం నిర్ధారించబడుతుంది.











