ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించేందుకు జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మక తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 18 మండలాల్లోని 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు, సుమారు 25 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు.
ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంతానికి జేజేఎం - అమరజీవి జలధారలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కీలకమైన ఇంటేక్ వెల్, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనుల్లో పురోగతి 130 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తి శరవేగంగా సాగుతున్న రూ. 2,370 కోట్ల భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు 18 మండలాలు, 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం దాదాపు 25 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత అత్యంత తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన తాగు నీటి ప్రాజెక్టుల పనులు వారాంతపు లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఏడాది చివరినాటికి పూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని, ఎప్పటికప్పుడు పూర్తికావాల్సిన పనులపై సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేసి, గడువులోపు ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల కింద రూ. 2,370 కోట్లతో చేపట్టిన మల్టీ విలేజ్ స్కీమ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ నిర్మాణం కోసం వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలి. ప్రతి గొంతు దాహార్తి తీరాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ సంకల్పాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధారలుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 2024తో ముగిసిన జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దాదాపు రూ. 26,000 కోట్ల విలువ చేసే తాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులో మొదటి విడతగా రూ. 7,910 కోట్లతో ఐదు జిల్లాల పరిధిలో చేపట్టిన ఐదు మెగా వాటర్ గ్రిడ్ పథకాల్లో కూడా ఒకటి. ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించేందుకు జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్ఠాత్మక తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా వినియోగిస్తూ అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న 3,163 ఆవాసాలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించనున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. మల్టీ విలేజ్ తాగునీటి పథకానికి సంబంధించి గండికోట వద్ద నిర్మాణం చేపట్టిన ఒక ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. నాలుగు రా వాటర్ సంపులు నిర్మించాల్సి ఉండగా, అందులో మూడు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, గుర్రంకొండ వద్ద 75 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఒక నీటి శుద్ధి కేంద్రం, వెలిగల్లు వద్ద 26 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో మరో నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ దశలో ఉన్నాయి. ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర 167 పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 130 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.










