మాజీ మంత్రి కేటీఆర్ గురువారం నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ నది సుందరీకరణ పనులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టును 'బ్యూటిఫికేషన్' కాదని, 'లూటిఫికేషన్' అని ఆయన అభివర్ణించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, మూసీ నది పేరుతో ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటామని, పేదల ఇళ్లను కాపాడతామని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేతకాకపోతే బాధ్యతలను తమకు అప్పగించాలని, ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తామని అన్నారు. మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మూసీ ప్రక్షాళన అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాలు పేదల కన్నీళ్లను పట్టించుకోలేదని, ప్రస్తుతం కూడా అదే జరుగుతోందని ఆయన ఆరోపించారు. 16వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షా 50వేల కోట్లకు పెంచారని, రెండేళ్లు గడిచినా డీపీఆర్ కూడా లేదని విమర్శించారు.









