మదురై, 24 జనవరి 2024
మదురై జిల్లా కొట్టాంపట్టి సమీపంలోని సొక్కంపట్టి ప్రాంతంలో రాతి క్వారీలకు వ్యతిరేకంగా ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. తమ జీవనోపాధి, వ్యవసాయం, భూగర్భ జలాలపై ప్రభావం చూపుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్థులు మంగళవారం క్వారీల వద్ద ముట్టడికి దిగారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సొక్కంపట్టి సమీపంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రెండు క్వారీలు పక్కపక్కనే పనిచేస్తున్నాయి. వీటి వల్ల వలైచేరిఫట్టి, వేలాయుధంపట్టి, వలయంకులత్తుపట్టి, తొంతిలింగపురం, సొక్కంపట్టి గ్రామాల్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో 30 అడుగుల లోతులోనే లభించిన భూగర్భ జలాలు ప్రస్తుతం 300 అడుగులకు దిగువకు వెళ్లాయని, దీంతో వ్యవసాయం చేయలేక కొందరు కూలీ పనులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.











