ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ తలపై నుంచి లాక్కోవడం కలకలం రేపింది.
నెమలి గ్రామంలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలోనే పట్టు వస్త్రాలను ఆయన తలపై నుంచి లాక్కోవడం అక్కడున్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన వ్యవహరించిన తీరు సరికాదని, ఇది ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనతో ఎమ్మెల్యే మరోసారి వార్తల్లో నిలిచారు.









