శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గుముఖం పట్టడంతో, సప్త నదుల సంగమ ప్రాంతంలో నీట మునిగిన సంగమేశ్వరాలయం గోపురం క్రమంగా బయటకు కనిపిస్తోంది. సాయంత్రానికి ఆలయ గోపురం భక్తులకు దర్శనమిచ్చే స్థాయికి నీటిమట్టం తగ్గింది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ఆదివారం నీటిమట్టం 855.90 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 94.2380 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో సంగమేశ్వరాలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.











