తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ, పంపిణీకి సంబంధించిన వివాదం మరోసారి సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. సిట్ నివేదికపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లో, సిట్ దర్యాప్తు నివేదికపై నియమించిన ఏకసభ్య కమిటీ పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కమిటీ ఏర్పాటు సరైన పద్ధతి కాదని ఆయన వాదించారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సిట్, సీబీఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గతంలో తిరుమల లడ్డూ వ్యవహారాలపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. సిట్ సమర్పించిన నివేదికపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.










