తిరుమలగిరి పట్టణంలో హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో ఆహార భద్రత అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో పలు చోట్ల అపరిశుభ్రత, కృత్రిమ రంగుల వినియోగం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, వాడిన నూనెను పదేపదే వాడటం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు.
సోమేశ్వర ఫ్యామిలీ దాబా/రెస్టారెంట్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన ఆహారాన్ని మరుసటి రోజు మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు, సంస్థకు అవసరమైన లైసెన్స్ లేదా నమోదు కూడా లేదని గుర్తించి, దాబాను సీజ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చెర్రీ బార్ అండ్ దాబాలోనూ కృత్రిమ రంగుల వినియోగం, అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించిన అధికారులు మెరుగుదల నోటీసు జారీ చేశారు. నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించారు.











