అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. గాజా శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీతో చర్చించానని, ఆయన ఈ ఒప్పందంపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
బోర్డ్ ఆఫ్ పీస్‌లో మాట్లాడుతూ, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజా పునరుద్ధరణకు అమెరికా కట్టుబడి ఉంటుందని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ శాంతి స్థాపనలో ప్రధాని మోదీ పాత్రను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగితే, ఇరు దేశాలపై 200% టారిఫ్‌లు విధించేవాడినని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, రెండు అణ్వాయుధ దేశాల మధ్య తానే సంధి కుదిర్చినట్లు ఆయన మరోసారి పేర్కొన్నారు.










