నర్సాపూర్
మెదక్ జిల్లా ప్రాంతంలో పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరి పంటలకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొందరు ట్రాక్టర్లకు మోటార్లు బిగించి బావుల నుంచి నీటిని తోడుతుండగా, మరికొందరు జనరేటర్లను ఉపయోగించి పంటలకు సాగునీరు అందిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కు చెందిన రైతు శ్రీపాల్ నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటకు కీలకమైన సమయంలో విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో, బావి నుంచి నీటిని పొలానికి తరలించేందుకు ట్రాక్టర్‌కు మిషన్ బిగించారు. కరెంట్ కోసం ఎదురుచూస్తే పంట ఎండిపోయే పరిస్థితి ఉండటంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే, ట్రాక్టర్ వినియోగం వల్ల అదనపు డీజిల్ ఖర్చు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులకు డీజిల్‌కే సుమారు రూ.2 వేల వరకు ఖర్చవుతోందని చెప్పారు.











