బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఢాకా, గాజీపూర్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని పోలీస్ ఔట్‌పోస్టులు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సరిహద్దు భద్రతా దళం () సిబ్బందిని రంగంలోకి దించారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమ కార్మికులకు కనీస నెలవారీ వేతనం 12,500 బంగ్లాదేశ్ టాకాలుగా ఉంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇళ్ల అద్దెలు, రవాణా, వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని 30,000 టాకాలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వేతనాలు కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని, ప్రస్తుత ఆదాయంతో జీవించడం కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. గాజీపూర్‌లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు ప్రధాన రహదారులను దిగ్బంధించారు. కోనాబారి ప్రాంతంలో ఓ పోలీస్ ఔట్‌పోస్టుకు, మరికొన్ని చోట్ల వాహనాలకు నిప్పుపెట్టినట్లు స్థానిక మీడియా నివేదించింది. కొన్ని వస్త్ర పరిశ్రమల గోదాములు, భవనాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం.












