నెల్లూరు, 2 నవంబర్ 2026
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురాసు () దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు నర్సాపూర్ మధ్య, ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ () వెల్లడించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తీరం దాటే సమయంలో గంటకు 100110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.












