తెలంగాణ సాయుధ పోరాట యోదురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం నాడు నైజాం భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన తెగువ, ధైర్యం నేటి తరానికి, ప్రత్యేకించి మహిళా లోకానికి ఆదర్శప్రాయమని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారికంగా వేడుకలు











