మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పరిశీలించారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంత నివాస గృహాలను మంజూరు చేసే ఈ పథకం పారదర్శకంగా జరగాలని వారు అధికారులకు సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తో తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించి, అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం సొంత నివాస గృహాలను మంజూరు చేస్తుందని చైర్పర్సన్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.












