వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మికుల హక్కుల పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, అవగాహన కల్పించేందుకు రూపొందించిన స్వేచ్ఛా రథం ప్రచార వాహనాన్ని ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. బాధితుల కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉంచారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, వెట్టిచాకిరీ నిరోధక చట్టం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి, బాధితులను గుర్తించి రక్షించడంతో పాటు వారికి అవసరమైన పునరావాసం, ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికులకు తమ హక్కులపై అవగాహన కల్పించి, వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే స్వేచ్ఛా రథం ద్వారా అసంఘటిత కార్మికులు, వెట్టిచాకిరీకి గురయ్యే ప్రమాదం ఉన్న వర్గాలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఇటుక బట్టీలు, చేపలు, రొయ్యల పెంపకం, గనులు, క్వారీల వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు వెట్టిచాకిరీ దుష్పరిణామాలు, కార్మిక హక్కులు, ఫిర్యాదుల నమోదు విధానాలపై అవగాహన కల్పించనున్నారు.












