కామారెడ్డి, 2026-08-21
కామారెడ్డి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.












