వై.ఎస్.ఆర్ కడప, 22 September
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ () పథకం కింద రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ()లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 106 నియోజకవర్గాలు, 123 మున్సిపాలిటీలలో రూ.11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం కుప్పం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేసి, పనులకు శ్రీకారం చుట్టారు.












