ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,354 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం తెలిపింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది. తొలి విడత నామినేషన్లకు ఈ నెల 17 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నెల 26న తొలి విడత పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల కానుంది. రెండో విడత నామినేషన్లకు ఈ నెల 20 చివరి గడువుగా ఉంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ జరగనుంది.












