తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతుల వంటి అంశాలపై ముఖ్యమంత్రి వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో జరిగిన సమావేశంలో, హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టు పురోగతికి అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.












