హైదరాబాద్, జూలై 25
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ కు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో స్థానిక ప్రముఖులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్రను, బాధితులకు న్యాయం అందించడం, ప్రజలలో అవగాహన పెంపుదల వంటి అంశాలను కిషోర్ కుమార్ వివరించారు.
మానవ హక్కుల కోసం నిరంతర అలుపెరుగని పోరాటం చేస్తున్న తలారి తరుణ్ కుమార్ ను ఈ సందర్భంగా సత్కరించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ కు స్థానిక ప్రముఖులు, సభ్యులు సాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో మానవ హక్కుల కమిషన్ పాత్ర అత్యంత కీలకమైనదని వివరించారు. బాధితులకు న్యాయం అందించడం, హక్కుల పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించడం కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని చాలా పద్ధతిగా, విస్తృతంగా తెలియజేశారు.
ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు కొండా వెంకటేష్, సల్లా సతీష్ కుమార్, గిరి మహారాజ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తలారి తరుణ్ కుమార్, రాంబాబు, డప్పు నరసింహారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మానవ హక్కుల పరిరక్షణకు తమ వంతు సహాయం అందిస్తామని, సంస్థ సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.










