హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోపనపల్లిలోని జయభేరి అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
ఆదివారం ఉదయం అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. మృతులను బత్తుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి (38)గా గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబంలో నెలకొన్న సమస్యలు, అనారోగ్య ఇబ్బందుల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు.












