ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి 150 నీటి ట్యాంకర్లను కేటాయించినట్లుగా వచ్చిన వార్తలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) తీవ్రంగా ఖండించింది. వేసవి తాండవం నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి కొరత ఉన్న సమయంలో ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలపై రాజమౌళి నివాసానికి 150 నీటి ట్యాంకర్లను HMWS&SB సరఫరా చేసిందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన బోర్డు, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, దీని వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఉందని తెలిపింది. ప్రస్తుతం నగరంలో నీటి ఎద్దడిని అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
HMWS&SB ప్రస్తుతం రోజుకు సుమారు 260 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటిని సరఫరా చేస్తోందని, అయితే డిమాండ్ 300 MGDకి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనవసరంగా నీటిని వృధా చేయవద్దని సూచించారు. నీటి సంరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు.












