హైదరాబాద్ నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) 'స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్' అనే నూతన ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరంలో పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచాలని యోచిస్తున్నారు.
నగరంలో పెరుగుతున్న వాహన రద్దీతో పాటు పార్కింగ్ సమస్య కూడా తీవ్రమవుతోంది. రోడ్ల పక్కన వాహనాలను నిలిపడం వల్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ ఈ సమస్యను పరిష్కరించడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రాజెక్టులో భాగంగా, మైజీహెచ్ఎంసీ మొబైల్ అప్లికేషన్లో ప్రత్యేకంగా ఒక లింక్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వాహనదారులు అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాలను గుర్తించి, తమ వాహనాలను సులభంగా పార్క్ చేసుకోవచ్చు. ఈ సేవలను అందించడానికి అవసరమైన ఏజెన్సీల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించి, రెండు సంస్థలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.












