కర్నూలు, జూన్ 30
కర్నూలు జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు నిజాయితీ, అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన 13 మంది పోలీసు అధికారులను కర్నూలు పోలీసు శాఖ ఘనంగా సన్మానించింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులకు ఘన సన్మానం జరిగింది. కర్నూలు జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం నిజాయితీతో, అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన 13 మంది పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.












