భవిష్యత్తు 6 వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగపడే అత్యాధునిక సాంకేతికతను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని పరిశోధకులు రూపొందించిన కొత్త ఫోటోనిక్ సాంకేతికతతో, టెరాహెర్ట్జ్ తరంగాలు సిలికాన్ చిప్‌లోని అడ్డంకులను దాటినా సిగ్నల్ నష్టం తక్కువగా ఉంటూ సెకనుకు 100 గిగాబిట్ల (100 ) వేగంతో డేటాను ప్రసారం చేయగలుగుతున్నారు.
భవిష్యత్తు 6 వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో ఉపయోగపడే అత్యాధునిక సాంకేతికతను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టెరాహెర్ట్జ్ తరంగాలు సిలికాన్ చిప్‌లోని ప్రత్యేక అడ్డంకులను దాటినా సిగ్నల్ నష్టం చాలా తక్కువగా ఉండేలా కొత్త ఫోటోనిక్ సాంకేతికతను రూపొందించారు. ఈ విధానంతో సెకనుకు 100 గిగాబిట్ల (100 ) వేగంతో డేటాను ప్రసారం చేయగలిగారు. బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ () పరిశోధకులు ఈ ఘనత సాధించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఈ పరిశోధన వివరాలను వెల్లడించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణంగా చిన్న సైజులో ఉండే కమ్యూనికేషన్ చిప్‌లలో తరంగాలు ప్రయాణించే మార్గంలో మలుపులు, అడ్డంకులు ఏర్పడితే సిగ్నల్ బలహీనపడుతుంది. దీనివల్ల డేటా ప్రసార సామర్థ్యం తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు టోపోలాజికల్ ఫోటోనిక్స్ అనే విధానాన్ని ఉపయోగించారు. గ్రాఫీన్ నిర్మాణాన్ని పోలిన ఆకృతిలో సిలికాన్ పలకపై త్రిభుజాకార రంధ్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఫోటోనిక్ క్రిస్టల్‌ను రూపొందించారు. రంధ్రాల పరిమాణాలను మార్చడం ద్వారా కృత్రిమ అడ్డంకులను సృష్టించారు. అయినప్పటికీ తరంగాలు వాటిని దాటేటప్పుడు సిగ్నల్ నష్టం కేవలం 12 శాతంగా మాత్రమే నమోదైంది. వరుసగా రెండు అడ్డంకులు ఉన్నప్పుడు కూడా నష్టం 23 శాతానికే పరిమితమైంది.












