భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశీయ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.51 గంటలకు ప్రయోగం జరగనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.51 గంటలకు ప్రయోగం జరగనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నావిక్ వ్యవస్థకు మరింత బలం
భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (నావిక్) వ్యవస్థకు ఎన్వీఎస్-03 ఉపగ్రహం కీలకం కానుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌తో పాటు దేశ సరిహద్దుల వెలుపల సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సమాచార సేవలను అందించాలనేది లక్ష్యం.












