స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం నథింగ్ సంస్థ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ నథింగ్ ఓఎస్ 5.0ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన ఈ అప్డేట్లో కొత్త రూపకల్పన, మెరుగైన పనితీరు, వ్యక్తిగతీకరణ సదుపాయాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చారు.
తొలుత నథింగ్ ఫోన్ (3)కు ఈ అప్డేట్ విడుదల కాగా, ఇతర నథింగ్, సీఎంఎఫ్ ఫోన్లకు దశలవారీగా అందించనున్నారు. హోమ్ స్క్రీన్‌పై పారదర్శక విడ్జెట్లు, కొత్త రంగుల అమరిక, మెరుగైన చిహ్నాలు అందుబాటులోకి వస్తాయి. తేదీ, సమయం, వాతావరణం, రాబోయే సమావేశాల వివరాలను చూపించే కొత్త గడియార రూపకల్పన కూడా ఉంది. నథింగ్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపైన గ్లిఫ్ లైట్లను నియంత్రించేందుకు ప్రత్యేక యాప్‌ను అందిస్తున్నారు. హోమ్ స్క్రీన్ నుంచే టైమర్ సెట్ చేసుకోవచ్చు. సమయం పూర్తయినప్పుడు గ్లిఫ్ లైట్ల ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. ఎసెన్షియల్ స్పేస్ ద్వారా వాయిస్ నోట్స్‌ను లిఖిత రూపంలోకి మార్చడం, సమాచారాన్ని సంక్షిప్తం చేయడం, ముఖ్యమైన అంశాలను గుర్తించడం వంటి పనులు చేయవచ్చు. సేకరించిన చిత్రాలు, స్క్రీన్షాట్లు, నోట్స్‌ను ఒకే చోట క్రమబద్ధీకరించేందుకు స్మార్ట్ కలెక్షన్స్ సదుపాయం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యాప్‌లు తెరుచుకునే వేగం, టచ్ స్పందన, ఒకేసారి పలు యాప్‌లను ఉపయోగించే సామర్థ్యాన్ని మెరుగుపరిచే మార్పులు చేశారు. బ్లూటూత్ సెట్టింగులను త్వరగా అందుకునేలా క్విక్ సెట్టింగ్స్‌లోనూ మార్పులు తీసుకొచ్చారు. నోటిఫికేషన్లు, క్విక్ సెట్టింగులను వేర్వేరుగా నిర్వహించడం, సమీప పరికరాలకు ఫైళ్లను పంచుకోవడం, గోప్యతా నియంత్రణలు వంటి సదుపాయాలు కూడా ఈ వెర్షన్లో ఉన్నాయి. నథింగ్ అధికారిక వెబ్సైట్ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం అప్డేట్ విడుదల సమయాలు ఇలా ఉన్నాయి. ఇవి సూచనాత్మక తేదీలు మాత్రమే; ప్రాంతం, మొబైల్ నెట్వర్క్ ఆధారంగా విడుదలలో మార్పులు ఉండవచ్చు. 26: నథింగ్ ఫోన్ (3) విడుదల ప్రారంభమైంది. 26: నథింగ్ ఫోన్ (4) ప్రో, ఫోన్ (4), ఫోన్ (3) ప్రో, ఫోన్ (3), ఫోన్ (2), ఫోన్ (2) ప్లస్. 26: నథింగ్ ఫోన్ (3) లైట్. 27: నథింగ్ ఫోన్ (4), సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో.












