మండలం వలసపల్లె జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముజీబ్ (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, అతనితో పాటు ఉన్న ఇమ్రాన్ (30) తీవ్రంగా గాయపడ్డాడు. లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్, ఇమ్రాన్ లు కృష్ణాపురం వద్ద టమాటాలు లోడ్ చేసుకున్నారు. అనంతరం మార్కెట్ కు వెళ్లేందుకు హైవే రహదారిపైకి రాగానే, ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ముజీబ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసులు కేసు నమోదు












