
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని తమ కులవృత్తి అయిన మేరు కుల సభ్యులందరికీ విస్తరించాలని కామారెడ్డి జిల్లా మేరు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కామారెడ్డి పట్టణం జరిగిన జిల్లా మేరు సంఘం సమావేశం ఈ మేరకు తీర్మానించారు.

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం పద్మశాలి సంఘానికి కేటాయించిన 10 శాతం భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.

















