కామారెడ్డి, 7 September
దుబాయ్‌లో జిటిఎఫ్ (గల్ఫ్ తెలంగాణ ఫోరం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్)ను జిటిఎఫ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దుబాయ్ జిటిఎఫ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం దుబాయ్‌లో న నిర్వహించనున్న జిటిఎఫ్ (గల్ఫ్ తెలంగాణ ఫోరం) బతుకమ్మ వేడుకలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్)ను జిటిఎఫ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల సురేందర్‌తో పాటు కళ్యాణి, సుమిత్ర, ఆనంద్, మహేష్ బిగిలా తదితర ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వారి ఆహ్వానానికి కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ, వీలైనంతవరకు తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా దుబాయ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. జిటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ చాటిచెబుతున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు.










