బాల్కొండ, 7 September
మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గణేష్ మండపాల నిర్వాహకులకు నియమ నిబంధనలను అధికారులు తెలియజేశారు. గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ పంచాయతీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. మండపాల నిర్వహణకు అనుమతి తప్పనిసరి అని, ఇద్దరు వ్యక్తులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*కిసాన్ నగర్ గ్రామంలో గణేష్ మండపాల పై గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ కమిటీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండపాల నియమాల వెల్లడి* మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ,గ్రామ పంచాయతీ,పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులకు నియమ నబంధనలను తెలిపారు. ప్రతి గణపతి మండపం పోలీస్ శాఖ గ్రామాభివృద్ధి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ప్రతి మండపానికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల పేర్లు ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు. మండపం దగ్గర జరిగే ప్రతి మంచి చెడు పనులకు వీరిద్దరే బాధ్యత వహించాలని తెలిపారు. భజన డోలు బ్యాండు ను మాత్రమే వాడవలసి ఉంటుందని చెప్పారు. గ్రామాభివృద్ధి కమిటీ గ్రామపంచాయతీ చెప్పిన 11వ రోజు మాత్రమే గణపతిని నిమజ్జనం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. మండపాల దగ్గర మద్యం సేవించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిమజ్జనం రాత్రి రెండు గంటలకు ముగించవలసి ఉంటుందని, లేనిచో గణపతి మండపం యొక్క ఇద్దరు, ట్రాక్టర్ డ్రైవర్ ఓనర్ పైన తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీస్ శాఖ వివరించారు. పదవ తరగతి వరకు చదివిన పిల్లలు ఎవరు గణపతి మండపాలు పెట్ట రాదని మిగతా మండపంలో పాల్గొనాలని తెలిపారు. డాక్టర్ డ్రైవర్ ఓనర్లు ఏ గణపతి యొక్క మండపానికి చివరి రోజు ట్రాక్టర్ పెడుతున్నారో గ్రామ కమిటీ యొక్క అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు గణేష్ మండపాల వద్ద జరిగే కార్యక్రమానికి రాత్రి 12 గంటల వరకు సౌండ్ బంద్ చేయవలసిందిగా హెచ్చరించారు.ఈ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు తెలిపారు.











