ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో దళితులు భూమి వివాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ భూమి రికార్డులు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో కొందరు అక్రమార్కులు మొరం తవ్వకాలు, చెట్లు నరికివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
సమాజంలో సాంకేతికత పెరిగి, దేశం ముందడుగు వేస్తున్నామని చెబుతున్నా, కొందరు దళితులు మాత్రం తమ స్వంత భూమిపైనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన మట్ట విజయ, మట్ట దేవపాల తమ భూమి రికార్డులు ఆన్‌లైన్‌లోకి రాకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఆవేదనతో వ్యక్తం చేశారు. ఈ సాంకేతిక లోపాన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుని, బాధితుల జీవితాలను తలకిందులు చేస్తున్నారని వారు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భూమిపై అక్రమార్కుల కన్ను












