పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండలం చాకిర్యాల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నరసయ్య కుటుంబాన్ని సీఐ జాన్ రెడ్డి, ఎస్సై సువాసిని, పోలీస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలం చాకిర్యాల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నరసయ్య కుటుంబాన్ని సీఐ జాన్ రెడ్డి, ఎస్సై సువాసిని, పోలీస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నరసయ్య కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని సీఐ జాన్ రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











