ఇస్సానగర్ గ్రామానికి చెందిన కొమ్మిడి పుష్పలత నర్సారెడ్డి బీబీపేట్ పీఏసీఎస్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఎస్ ఫ్రెండ్స్ సిండికేట్ ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
బీబీపేట్ పీఏసీఎస్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మిడి పుష్పలత నర్సారెడ్డిని ఇస్సానగర్ గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, ఎంబరి స్వామి, మాజీ సర్పంచ్ పొట్టయ్య, మాజీ ఎంపీటీసీ శివరాజ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభినందనల వెల్లువ












