మాల సంఘాల జెఎసి నిజామాబాద్ జిల్లా చైర్మెన్ గా మండలం వన్నెల్ (కే) కు చెందిన బండి రవీందర్ ను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జెఎసి చైర్మన్ మందాల భాస్కర్ తెలిపారు. ఆర్మూర్ లో జిల్లాకు వచ్చిన ఆయన ఈ మేరకు మాల సంఘాల జెఎసి జిల్లా చైర్మెన్ గా బండి రవీందర్ ను ప్రకటించారు.
మాల సంఘాల జెఎసి నిజామాబాద్ జిల్లా చైర్మెన్ గా మండలం వన్నెల్ (కే) కు చెందిన బండి రవీందర్ ను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జెఎసి చైర్మన్ మందాల భాస్కర్ తెలిపారు. ఆర్మూర్ లో జిల్లాకు వచ్చిన ఆయన ఈ మేరకు మాల సంఘాల జెఎసి జిల్లా చైర్మెన్ గా బండి రవీందర్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. మాలలను ఐక్యం చేసి ఉద్యమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని, త్వరలో నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో అన్ని మాల సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు కలిసి పని చేయాలని కోరారు. అన్ని వర్గాల మాలలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా చైర్మెన్ గా ఎన్నికైన బండి రవీందర్ మాట్లాడుతూ, తన బాధ్యతలను తప్పకుండా నిర్వర్తిస్తానని, అందుకు మాలలందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జెఎసి నేతలు రాహుల్, లింగన్న, సంజీవ్ లు పాల్గొన్నారు.











