కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డిలో షాపింగ్ మాల్లో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు పోలీసుల సహాయంతో సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఆటో డ్రైవర్ సకాలంలో స్పందించి, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ కుటుంబం తిరిగి కలవగలిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ఇస్రోజివాడికి చెందిన కంచర్ల శంకర్, పావని దంపతులు తమ ఐదేళ్ల కుమారుడు అన్విక్‌తో కలిసి నిజాంసాగర్ రోడ్డులోని విశాల షాపింగ్ మాల్లో బట్టలు కొనుగోలు చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో అన్విక్ తప్పిపోగా, ఆటో డ్రైవర్ కొంక ప్రసాద్ అతన్ని కామారెడ్డి పోలీస్ స్టేషన్లో అప్పగించారు.












