అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులను నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ హెచ్చరించారు. దీపావళి సందర్భంగా ప్రజలు, వ్యాపారులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు.
జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, దీపావళి పర్వదినాన టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టపాసులు ఎక్కడైనా అక్రమంగా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా వెంటనే డయల్ 112 కు గాని, స్థానిక పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లైసెన్స్ కలిగిన దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు చేయాలని, సూచించిన బహిరంగ ప్రదేశాలలో, వారికి కేటాయించిన ప్రాంతంలో నిర్ణీత కొలతలతో ప్రత్యేక షెడ్డులలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని, నిబంధనలను పక్కాగా పాటించాలని సూచించారు. లైసెన్స్ పొందిన పర్మనెంట్ గోడౌన్లు, పర్మనెంట్ షాపులు, తాత్కాలిక విక్రయ షాపుల నిర్వాహకులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.












