అమడగూరు, 9 September
అన్నమయ్య జిల్లా, చిన్న మండలం పరిధిలోని వండాడి గుట్టల వద్ద గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి, మృతదేహాన్ని కాల్చివేసి, ఆనవాళ్లను తారుమారు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వండాడి గుట్టల వద్ద గుర్తుతెలియని వ్యక్తి హత్య? అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గంలోని చిన్న మండలం, వండాడి గుట్టల వద్ద గుర్తుతెలియని వ్యక్తిని ఎవరో పథకం ప్రకారం చంపి కాల్చేసి ఆనవాళ్ళను తారుమారు చేసిన ఘటన నేడు వెలుగు చూసింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో చిన్న ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని కాలిన బాడిని పరిశీలించి, ఖాదర్ బాష ఫిర్యాదుపై స్పాట్ పిఎం నిర్వహించినట్లు తెలిపారు. మృతురాలు దేవగుడిపల్లికి చెందిన వృద్ధ మహిళ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే లోతుగా విచారణ చేపట్టామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.












