గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేకు అనుమతి లేకపోవడంతో, ముందుగా చెల్లించిన రూ.60 వేల అడ్వాన్స్‌ను పోలీసులు తిరిగి ఇప్పించారు. మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ్ యూత్ గణపతి మండల అధ్యక్షుడు గడ్డం శ్రీకాంత్, సుమారు 15 రోజుల క్రితం డీజే నిర్వాహకుడికి రూ.60 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.
గణేష్ ఉత్సవాల్లో డీజే వినియోగానికి అనుమతి లేకపోవడంతో, తన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన ఎస్ఐ విజయ్, డీజే నిర్వాహకుడితో మాట్లాడి శ్రీకాంత్ చెల్లించిన రూ.60 వేల మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇప్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిబంధనలను అమలు చేస్తూనే, ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మానవీయ దృక్పథంతో పరిష్కారం చూపుతున్నామని పోలీసులు తెలిపారు. నిబంధనలు చెప్పడమే కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే పోలీసుల బాధ్యత అని ఈ ఘటన ద్వారా పోలీసులు చాటిచెప్పారు.












