జిల్లా నగరి మండలం కాకవేడు ఎస్టీ కాలనీలో బుధవారం సాయంత్రం జరిగిన విషాద ఘటనలో ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో మౌనిక (15) అనే బాలిక మృతి చెందగా, ఆమె ప్రాణ స్నేహితురాలు జీవిత (17) అపస్మారక స్థితిలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
చిన్నతనంలోనే తల్లులను కోల్పోయిన మౌనిక, జీవిత ఒకరికొకరు తోడుగా ఉంటున్నారని స్థానికులు తెలిపారు. ఎప్పుడూ కలిసి తిరిగే వీరిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల దర్యాప్తు












