దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచించారు. ప్రజల భద్రత కోసం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని తెలిపారు.
ఇంటి భద్రత కోసం నాణ్యమైన తాళాలు, సెంట్రల్ లాకింగ్ లేదా డిజిటల్ స్మార్ట్ లాక్‌లు ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పనిచేసేలా ఇన్వర్టర్ సదుపాయం కల్పించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బంగారం, నగదును ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, ఊళ్లకు వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని కోరారు. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.












