కామారెడ్డి, జూలై 25
కామారెడ్డి జిల్లాలో ఆర్టీవో వెహికల్ చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి మొబైల్‌కు వచ్చిన చలాన్ సందేశాన్ని నిజమని నమ్మి, అందులోని APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయడంతో సైబర్ నేరగాళ్లు అతని మొబైల్‌పై నియంత్రణ సాధించి, బ్యాంకు ఖాతా నుంచి నగదును అక్రమంగా బదిలీ చేశారు.
ఆర్టీవో వెహికల్ చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి మొబైల్‌కు వచ్చిన చలాన్ సందేశాన్ని నిజమని నమ్మి, అందులోని APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయడంతో సైబర్ నేరగాళ్లు అతని మొబైల్‌పై నియంత్రణ సాధించారు. అనంతరం అతని బ్యాంకు ఖాతా నుంచి నగదును అక్రమంగా బదిలీ చేశారు.
మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా, అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటన నేపథ్యంలో కామారెడ్డి పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే APK ఫైళ్లు, అనుమానాస్పద లింకులు లేదా యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని, ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు, ఆర్టీవో లేదా ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా APK ఫైళ్ల రూపంలో చలాన్ నోటీసులు పంపరని స్పష్టం చేశారు.










